భువనేశ్వర్: ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఓపీఎస్సీ) కొరాపుట్ జిల్లా పరిధిలో జయపురం కొత్త పరీక్ష జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చొరవతో మారుమూల ప్రాంతాల నుంచి అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యేందుకు రవాణా ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రస్తుతం ఓపీఎస్సీ బాలాసోర్, బరంపురం, భువనేశ్వర్, కటక్ మరియు సంబలపూర్ ప్రాంతాల్లో పరీక్ష జోన్లను నిర్వహిస్తోంది. కొరాపుట్ జిల్లా జయపురం చేరికతో ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల జోన్ పరిధి 6కు విస్తరించింది. ఈనెల 1న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో జయపురంలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు ఓపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్ ద్వారా జయపురం కొత్త జోన్ స్థాపనను నిర్ధారిస్తూ సన్నాహాలు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment