రాష్ట్రంలో కేంద్రమంత్రి జయశంకర్ పర్యటన
భువనేశ్వర్: రాష్ట్రంలో జరగనున్న ప్రవాసీ భారతీయ దివస్ పురస్కరించుకొని విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ రాష్ట్రంలో పర్యటించారు. దీనిలో భాగంగా ప్రఖ్యాత కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ ఆలయాలను మంగళవారం సందర్శించారు. శ్రీజగన్నాథుని దర్శించుకుని పూజాదులు నిర్వహించారు. ప్రపంచ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రవాస భారతీయుల్లో సాంస్కృతిక బంధాలను కోణార్క్ కళాఖండం పటిష్టపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ వారసత్వంపై లోతైన అవగాహనను ప్రేరేపిస్తుందన్నారు.
రాజధాని చేరుకున్న ప్రవాస భారతీయులు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) వార్షిక ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ) వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర రాజధాని నగరంలో బస చేశారు. దీనిలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ సందర్శించి మూల విరాటులను దర్శించుకున్నారు. వీరికి స్థానికులు ఆత్మీయంగా ఆహ్వానం పలికి మనసు దోచుకున్నారు. అనేక మంది సందర్శకులు ఆలయం ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో ప్రశాంతత ప్రసాదించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment