ఆధునిక హంగులు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని పర్లాకిమిడి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు పూర్తి కానున్నాయి. రైల్వేస్టేష్టన్ మెయిన్ బిల్డింగ్, ప్లాట్ ఫారం పనులు 90 శాతం పూర్తవ్వగా, ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రైల్వేస్టేషన్ ఆవరణలో పార్కింగ్, పాత స్టీమ్ ఇంజిన్ నమూనా, రహదారి పనులు కొనసాగుతున్నాయి. పీఎం అమృత్ భారత్ పథకం కింద ఒడిశాలోని 21 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రెండో పర్యాయంలో సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్టు ఈస్టుకోస్టు రైల్వే డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ తెలియజేశారు. ఏప్రిల్ ఒకటి నాటికి పర్లాకిమిడి రైల్వేస్టేషన్ ఆధునికరణ పనులు పూర్వవుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment