పరీక్ష ఫీజుకు వేళాయె..
బాపట్ల టౌన్ : పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఫీజులు చెల్లించాలి. ఈ నెల 11వ తేదీలోగా చెల్లించుకోవచ్చు. జిల్లాలో మొత్తం 132 ప్రైవేటు, 200 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు బడుల్లో 6,658 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 11,475 మంది వంతున మొత్తం 18,133 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు 11వ తేదీలోగా నామినల్ రోల్స్ పూర్తి చేసిన తర్వాత స్కూల్ లాగిన్‌లో లింక్ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్ నామినల్ రోల్స్ (ఎంఎన్‌ఆర్) నేరుగా సంబంధిత డీఈవో కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. 12 – 18వ తేదీలోగా రూ. 50, 19 – 25వ తేదీలోగా రూ. 200, 26 – 30వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో ఫీజును చెల్లించవచ్చు. రెగ్యులర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఫీజు రూ.125 కాగా, ఫెయిలైన వారికి మూడు, అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ. 110, ఎక్కువ సబ్జెక్టులకు రూ. 125గా నిర్ణయించారు. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులు మామూలు ఫీజుకు అదనంగా మరో రూ.60 చెల్లించాలి. తక్కువ వయసున్న విద్యార్థులు (అండర్ ఏజ్ స్టూడెంట్స్) ఫీజుగా రూ.300 చెల్లించాలి.
పదో తరగతి వారికి ఈ నెల 11వ
తేదీలోపు చెల్లింపునకు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment