నెలాఖరు నుంచి పల్నాటి వీరారాధన ఉత్సవాలు
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలు నవంబరు 30వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్తిక అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు పల్నాటి వీరుల ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మొదటి రోజు శనివారం రాచగావు, డిసెంబరు 1వ తేదీ రాయబారం, 2వ తేదీ మందపోరు, 3వ తేదీ కోడిపోరు, 4వ తేదీ బుధవారం కళ్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయని పీఠాధిపతి పేర్కొన్నారు. మందపోరు చారిత్రక ఘట్టాన్ని స్మరిస్తూ సాగే ఉత్సవం నాడు డిసెంబరు 2వ తేదీ సోమవారం బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం కులమతాలకతీతంగా పెద్దల సమక్షంలో అది అమలు జరుగుతుందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలలో స్ధిరపడిన వీరాచారులు, వీర విద్యావంతులు ఉత్సవాలకు తరలిరావాలని పీఠాధిపతి పిలుపునిచ్చారు. కార్తిక పౌర్ణమి నాడు ఈ నెల 15వ తేదీ పోతురాజుకు పడిగెం కట్టే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత నుంచి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి పెడతామన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కోరారు.
తరలిరావాలని ఆచారవంతులకు
పీఠాధిపతి పిలుపు
Comments
Please login to add a commentAdd a comment