నిత్యావసరాల ధరలు తగ్గించాలి
నరసరావుపేట: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు డి.శివకుమారి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖల జనరల్ బాడీ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల విపరీతమైన అధిక ధరల వలన సామాన్య ప్రజల ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల ఎనిమిదో తేదీ నుంచి 15 వరకు ప్రచార కార్యక్రమం, 15వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. అలాగే సీపీఎం ఆధ్వర్యంలో డిసెంబరు ఏడు, ఎనిమిది తేదీల్లో నరసరావుపేటలో నిర్వహించే పార్టీ జిల్లా మొదటి మహాసభల విజయవంతానికి పట్టణ ప్రజలు సహకారం అందజేసి విజయవంతం చేయాలని కోరారు. ఈసందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో పట్టణ ఒన్‌టౌన్, టూటౌన్ కార్యదర్శులు సిలార్ మసూద్ సయ్యద్ రబ్బాని, సీనియర్ నాయకులు ఏవీకే దుర్గారావు, షేక్ మస్తాన్‌వలి, ధూపం సుభాష్ చంద్రబోస్, మిరపకాయల రాంబాబు, కట్ట కోటేశ్వరావు, జిలాని మాలిక్, సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.
ధరల పెంపుపై నిరసనగా ఈనెల 15న కలెక్టరేట్ ఎదుట ధర్నా సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు శివకుమారి
Comments
Please login to add a commentAdd a comment