ప్రత్తిపాడు: రానున్న కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటు నమోదుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. అర్హత ఉండీ ఓటు నమోదుకు దూరంగా ఉన్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. కానీ వారు రకరకాల కారణాలతో నమోదుకు ముందుకు రావడం లేదు. ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే పట్టభద్రులు కచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమానమైన డిప్లమోను పూర్తి చేసి ఉండటంతో పాటు, 2021 నవంబరు ఒకటో తేదీ నాటికి కోర్సు పూర్తి చేసి ఉన్నవారు ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి ఓటు హక్కుకు సిఫార్సు చేస్తారు.
గెజిటెడ్ సంతకాలతో తలనొప్పి..
పట్టభద్రులు ఓటు నమోదుకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు (ప్రొవిజినల్స్)పై కచ్చితంగా గెజిటెడ్ అధికారితో సంతకాలు చేయించాల్సి ఉంది. ఇది పట్టభద్రులకు కాస్తంత ఇబ్బందికరంగా మారింది. ఇదంతా ఎందుకులే అనుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పరిశీలన సమయంలో రకరకాల కారణాలను చూపిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రత్తిపాడు మండలంలో నివాసులైన పట్టభద్రులు వృత్తిరీత్యా, ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో స్థిర పడి ఉన్నారు. వారిలో కొంతమంది ఆన్‌లైన్‌లో తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారణ సమయంలో వారి నివాసాలను సందర్శించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు ఉంటేనే ఆమోదిస్తామని, లేదంటే కుదరదని చెబుతున్నారు. పట్టభద్రులకు ఓటు హక్కుకు ఏయే సర్టిఫికెట్లు కావాలో అవగాహన ఉండడం లేదు. డిగ్రీ ప్రొవిజనల్, ఆధార్‌కార్డు, ఫొటో ఉండాలని, ప్రొవిజనల్‌పై గెజిటెడ్ అధికారి అసిస్టేషన్ ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 6వ తేదీ వరకే సమయం ఉంది. అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
ఓటుహక్కు నమోదుకు చివరి తేదీ 6
పట్టభద్రుల్లో కొరవడిన అవగాహన
నామమాత్రంగా దరఖాస్తులు
అసిస్టేషన్ నిబంధనతో తలనొప్పి
Comments
Please login to add a commentAdd a comment