భట్టిప్రోలు: చేనేత కార్మికుల ఆత్మహత్యలను వెంటనే నివారించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సత్యసాయి జిల్లా పరిగి మండలం పెద్దరెడ్డిపాలేనికి చెందిన చేనేత కార్మికుడు ఆదినారాయణ అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు చేనేత కార్మిక సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, యారన్ సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్, పావలా వడ్డీ తదితర పథకాలను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నేతన్నలకు ముద్రా రుణాలు 50 శాతం సబ్సిడీతో మంజూరు చేయాలని కోరారు. ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడు ఆదినారాయణ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీ చేనేత కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment