పిడుగురాళ్ల: రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులను గుర్తించి గుంటూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు పిడుగురాళ్ల ఆర్‌పీఎఫ్ సీఐ కె.ఏడుకొండలు తెలిపారు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌లో గురువారం మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలోభాగంగా జనరల్, స్లీపర్ బోగీలను తనిఖీ చేయటంతో అందులో ముగ్గురు బాలురు హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్నట్లు గుర్తించారు. వారు కూలి పనులకు వెళ్తున్నారని తెలపటంతో అనుమానంతో ఆర్పీఎఫ్ పిడుగురాళ్ల స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలురు ఓ అనుమానిత వ్యక్తితో కలిసి కూలి పనులకు వెళ్తున్నట్టు తెలిసిందని, దీంతో వారిని రక్షించి గుంటూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్ ఏ ఎస్‌ఐ ఎస్‌కే సుభాని, హెడ్‌కానిస్టేబుల్ రామోహన్‌రెడ్డి, కానిస్టేబుల్ ఎ.సురేష్, కె.మోహన్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment