ఊరూవాడా ఉత్సాహం
నరసరావుపేట: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం అంబరాన్నంటాయి. ఊరూవాడా ఉత్సాహంతో ఉప్పొంగింది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేట రామిరెడ్డిపేటలోని పాతసమితి కార్యాలయ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కట్‌చేశారు. రొంపిచర్ల మండలంలోని విప్పర్ల, రెడ్డిపాలెం గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు.
● గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని కేక్ కట్‌చేశారు. పేదలకు అన్నదానం నిర్వహించారు.
● మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, దుర్గి, కారెంపూడి, నాగార్జునసాగర్, రెంటచింతల మండలాల్లో నాయకులు కేక్‌లు కట్‌చేసి పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు.
● పెదకూరపాడు నియోజకవర్గంలోని లగడపాడు, క్రోసూరు మండలాల్లో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎస్సీ కాలనీల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద కాలనీ వాసులు కేకులు కట్‌చేశారు.
● వినుకొండ నియోజకవర్గంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బత్తుల వెంకటేశ్వర్లు, గంధం బాలిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, ఎంపీపీ జయశ్రీ వెంకటరామిరెడ్డిల నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు పీఎస్ ఖాన్ నేతృత్వంలో కేక్ కట్‌చేసి అన్నదానం నిర్వహించారు.
● సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. పరివర్తన మానసిక వికలాంగుల ఆశ్రమ పాఠశాలలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఏరియా వైద్యశాలలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఆదరణ అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నసంతర్పణ చేశారు. ముప్పాళ రాజుపాలెం, నకరికల్లు మండలాల్లోనూ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పలు కార్పోరేషన్ల మాజీ డైరెక్టర్లు, మండల నాయకులు, పార్టీ బాధ్యులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబరమంటిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సంబరాలు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు కేక్ కటింగ్స్, క్షీరాభిషేకాలు వైఎస్సార్‌సీపీ శ్రేణుల సేవా కార్యక్రమాలు
Comments
Please login to add a commentAdd a comment