సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా కాంతారావు ఏకగ్రీవ ఎన
నరసరావుపేట: జిల్లా సాగునీటి యాజమాన్య కమిటీలకు సంబంధించిన నాగార్జున సాగర్ కుడికాలువ ప్రాజెక్ట్ కమిటీ (పీసీ) చైర్మన్, వైస్‌చైర్మన్‌ల పదవులకు శనివారం జిల్లా కలెక్టరేట్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. హాజరైన సభ్యులు ప్రాజెక్ట్ కమిటీకి చైర్మన్‌గా కులుకూరి కాంతారావు, వైస్ చైర్మన్‌గా ఉప్పలపాటి చక్రపాణిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు కలెక్టర్ పి.అరుణ్‌బాబు వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎన్నికను ఎన్‌ఎస్పీ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్ పర్యవేక్షించారు. చైర్మన్ కాంతారావు మాట్లాడుతూ కాలువలను బాగుచేసి చివరి భూములకు నీరందించేందుకు కృషిచేస్తానని చెప్పారు. వైస్ చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ తాను 1995 నుంచి నీటిసంఘ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్నానని చెప్పారు. గత కమిటీలో తాను డైరెక్టర్‌గా ఉన్నానని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని భువనచంద్ర టౌన్‌హాలులో చైర్మన్, వైస్ చైర్మన్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. దీనికి ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట, గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, పార్టీ నాయకులు నల్లపాటి రాము, బీజేపీ నాయకుడు రంగిశెట్టి రామకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
వైస్ చైర్మన్‌గా చక్రపాణి ఏకగ్రీవం ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కలెక్టర్ అరుణ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment