తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బిషప్ సత్యకిరణ్‌కు చోట
సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన బిషప్ ముక్తిపూడి సత్యకిరణ్‌కు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. సంస్థ నేషనల్ చైర్మన్ యు.వి.రత్నం ఆధ్వర్యంలో వివిధ రంగాల ప్రముఖులకు, సాహిత్య సేవకులకు అవార్డుల ప్రదానం, సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. బిషప్ ముక్తిపూడి సత్య కిరణ్ సాహిత్యలో కనబరిచిన ప్రతిభకు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ బాధ్యు లు, కళాకారులు, అభిమానులు డాక్టర్ పెద్దిటి జోసెఫ్, నన్నెపాగ ప్రశాంతి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మరొకరికి తీవ్రగాయాలు
వినుకొండ: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరొక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మార్కాపురం రోడ్డులోని పసుపులేరు వంతెన వద్ద ఆదివారం జరిగింది. వినుకొండ పట్టణానికి చెందిన ప్రతాపుల గురవయ్య(62), ప్రతాపుల భీమరాజు కలిసి ద్విచక్రవాహనంపై వినుకొండ వైపునకు వస్తుండగా వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భీమరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను వినుకొండకు తరలించగా మెరుగైన చికిత్స కోసం భీమరాజును నరసరావుపేట తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కింద పడి
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తెనాలి రూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వేస్టేషన్ లో ఆధారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 65 ఏళ్ల వయసున్న వ్యక్తి స్టేషన్‌లోని నాలుగో నంబరు ప్లాట్ ఫాంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment