దేవరత్నం మెమోరియల్ స్కాలర్‌షిప్ టెస్ట్
పిడుగురాళ్ల: పట్టణంలోని లెనిన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లా స్థాయిలో దొప్పలపూడి దేవరత్నం మెమోరియల్ స్కాలర్‌షిప్ టెస్ట్‌ను ఆదివారం నిర్వహించారు. మదర్ థెరిస్సా మిత్రమండలి, లెక్కల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 50 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కె.హేమంత్ ప్రథమస్థానం సాధించారు. అలాగే ఒప్పిచర్ల జిల్లాపరిషత్ హైస్కూల్‌కు చెందిన చంద్రిక ద్వితీయ స్థానం, బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన పి.హర్షవర్ధన్‌రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.నాగేశ్వరరావు విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి, ఎస్‌టీయూ ఏపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సీహెచ్ జోసప్ సుధీర్, పల్నాడు జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు ఎల్‌వీ రామిరెడ్డి, వి.మోహన్‌రెడ్డి, డి.అప్పిరెడ్డి, ఎం.గఫూర్, యు.చంద్రజిత్ యాదవ్, ఎన్.ఏడుకొండలు, పి.స్వామి, కె.రామలింగయ్య, డి.వెంకటేశ్వర్లు, కె.మల్లికార్జునరావు, జి.పుల్లారావు, హైస్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment