ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం
ఏటా వైభవంగా క్రిస్మస్ వేడుకలు
ఫిరంగిపురం: ఆంధ్రా రోమ్‌గా బాల ఏసు కెథడ్రల్ దేవాలయం ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోని అత్యంత ఎత్తు అయిన మొదటి చర్చిగా పేరొందింది. ఇక్కడ ఏటా ఘనంగా మూడు రోజులపాటు జరిగే క్రిస్మస్ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇదే తరహాలో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో క్రీస్తు జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచే నవదిన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. 23న ఫాదర్ విలియం ప్రత్యేక దివ్యపూజాబలి, 24న ఫాతిమా మర్రెడ్డి దివ్యపూజాబలి నిర్వహిస్తారు. 24న రాత్రి 11 గంటలకు క్రీస్తు జయంతి మహోత్సవాలు ఉంటాయి. గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరవుతారు. 25న విచారణ క్రైస్తవుల ఆత్మశరీర మేలు కోసం దివ్యపూజాబలి నిర్వహిస్తారు. ప్రధాన యాజకుడిగా తుమ్మా డోమనిక్ వ్యవహరిస్తారు. సాయంత్రం నిర్వహించే దివ్యపూజాబలిలో ప్రధాన యాజకుడిగా ఫాదర్ వి.రవీంద్ర పాల్గొంటారు. కార్యక్రమాలలో సహాయ విచారణ గురువులు వి. ప్రవీణ్‌కుమార్, బి.రవీంద్రలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. దాదాపు 150 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ రవీంద్రబాబు తెలిపారు. ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment