పీడీఎఫ్ అభ్యర్థులనే గెలిపించండి
ఎమ్మెల్సీ అభ్యర్ధి కేఎస్ లక్ష్మణరావు
నరసరావుపేట: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులనే గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో ఆదివారం కృష్ణ–గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావుకు మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ సమావేశం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 31 నాటికి పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా విడుదలవుతుందని పేర్కొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ కేఎస్ లక్ష్మణరావును గెలిపిద్దామని పిలుపునిచ్చారు.
జిల్లా సమన్వయ కమిటీ నియామకం
అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎం.మోహనరావు, కో–కన్వీనర్‌గా ఎస్.ఆంజనేయ నాయక్, సభ్యులుగా కె.శ్రీనివాసరెడ్డి, పి.ప్రేమ్‌కుమార్, జి.విజయసారథి, జి.మల్లేశ్వరి, ఎం.కోటేశ్వరరావు, రాధాకృష్ణ, ఏ.లక్ష్మిశ్వరరెడ్డి, ఏపూరి గోపాలరావు, జి రవిబాబు, ఆంజనేయరాజు, జి. ధరణి, పెద్దిరాజు, సాయికుమార్‌ను ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సీఐటీయు నాయకులు షేక్ శిలార్ మసూద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment