భళా.. బాలోత్సవం
నరసరావుపేట: అంతరించిపోతున్న దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలకు ఊపిరిపోస్తూ విద్యార్థులలో అభ్యుదయ భావాలు రేకెత్తించే బాలోత్సవాలకు ముగింపు లేదని బాలోత్సవాల వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా బాలోత్సవాల అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ అన్నారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పల్నాడు రోడ్డులోని పీఎన్‌సీ అండ్ కేఆర్ కళాశాల ప్రాంగణంలో శనివారం మొదలైన పల్నాడు బాలోత్సవం ఆదివారం రెండో రోజు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. బాలోత్సవాల ముగింపు సభలో పల్నాడు బాలోత్సవం కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో డాక్టర్ వాసిరెడ్డి రమేష్ మాట్లాడుతూ పల్నాడు బాలోత్సవం జాతరను తలపిస్తుందన్నారు. విద్యార్థులు, విద్యావేత్తలు మూఢ నమ్మకాలతో కాకుండా శాసీ్త్రయ దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు. ఈ ఉత్సవాలకు ముగింపు లేదని, ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో బాలోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రముఖ రచయితలు కాంతారావు, సుబ్బారావుతో పాటు అమరావతి బాలోత్సవ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు మాట్లాడుతూ బాలోత్సవాల ద్వారా పిల్లలలో విశాల ద్పక్పథం ఏర్పడుతుందని, ఆలోచన విధానం మారుతుందని, స్నేహభావం మెరుగుపడుతుందన్నారు. ఈసందర్భంగా బాలోత్సవాల నిర్వహణకు, అతిథులకు, చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, బంధువులకు భోజన సదుపాయం కోసం రూ.3లక్షల విరాళం అందజేసిన జెట్టి కోటేశ్వరమ్మ, ఆమె కుమార్తె సునీతను పల్నాడు బాలోత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించించారు.
ఉత్సాహంగా..
రెండవ రోజు పోటీలలో లఘు నాటికలు, జానపద నృత్యం, దేశభక్తి పాటలు, కోలాటం, స్పెల్ బి, ప్రాజెక్టు పని, రంగవల్లులు, విచిత్ర వేషధారణలు, మెమొరీ టెస్ట్, బెస్ట్ ఫ్రం వేస్ట్, వకృత్వం, కథలు చెప్పడం, బుర్రకథ, తెలుగు పద్యాలు, అభినయ గీతాలు, రైమ్స్, మట్టి బొమ్మలు పోటీలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, వారి బంధువులు వేలాదిగా తరలి రావడంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. బాలోత్సవాల అధ్యక్షుడు చిలకల రాజగోపాల్‌రెడ్డి, కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు ఎం.ఎస్.ఆర్.కె ప్రసాద్, కోశాధికారి కోయా రామారావు, కమిటీ సభ్యులు ఎ.భాగేశ్వరిదేవి, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, పల్నాడు విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు కామినేని రామారావు, షేక్ మస్తాన్‌వలి, ఆంజనేయ నాయక్, డి.శివకుమారి, ఆంజనేయరాజు పాల్గొన్నారు.
అట్టహాసంగా ముగిసిన పల్నాడు బాలోత్సవాలు పలు రంగాల్లో విద్యార్థులకు పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment