సీఎం పర్యటన షెడ్యూల్
నరసరావుపేట: ఈనెల 31న నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు సీఎం బయలుదేరుతారు. 10.50 గంటలకు నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11.30 వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. 11.35 గంటల నుంచి 12.35 వరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 12.40 గంటల నుంచి 1 గంట వరకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 1.45 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 2.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
ప్రజా సమస్యల
పరిష్కార వేదిక రద్దు
జిల్లా కలెక్టర్, ఎస్పీలు
నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికలను ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో పెట్టుకొని రద్దు చేసినట్లు కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించాలని వారు కోరారు.
దుర్గమ్మకు కానుకగా
3 కిలోల వెండి
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు వినుకొండకు చెందిన భక్తులు ఆదివారం 3 కిలోల వెండిని కానుకగా సమ ర్పించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఎంవీ ఫణీంద్ర కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ఈవో కేఎస్ రామరావును కలిసి 3 కేజీల వెండి బార్ల(ఐదు)ను అందజేశారు. అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
అమరేశ్వరునికి
లక్ష బిల్వార్చన
అమరావతి: అమరేశ్వరాలయంలో ఆదివారం దాతల సహకారంతో స్వామికి లక్షబిల్వార్చనను అలయ అర్చకులు, వేద పండితులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేశారు. ఆలయ అర్చకులు స్వామికి విశేష అలంకరణ చేసి సహస్రనామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వ దళార్చన నిర్వహించారు. బాలచాముండేశ్వరిదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేశారు.
త్రికోటేశ్వరుడి సన్నిధిలో అధికారులు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దేవదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనెల 31న సీఎం చంద్రబాబు కోటప్పకొండలో చేపట్టే పర్యటన ఏర్పాట్లపై దేవదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ అధికారులతో సమీక్షించారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద ఆదివారం 1616 క్యూసెక్కులు వదిలారు. తూర్పు కెనాల్‌కు 98, నిజాంపట్నం కాలువకు 69, కొమ్మ మూరు కాలువకు 1217 క్యూసెక్కులు వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment