నేటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు
నగరంపాలెం: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. ఈ నెల 30 నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ పరీక్షల ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కొలమానాలు తీసే కంప్యూటర్ యంత్రాల పనితీరును పరిశీలించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులు రావాలని సూచించారు. జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), డీపీఓ ఏవో అద్దంకి వెంకటేశ్వరరావు, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment