1120మంది పోలీసులు
800మంది జనం..
నరసరావుపేటరూరల్: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన హంగూ, ఆర్భాటాలతో సాగింది. ఇద్దరు పెన్షన్ లబ్ధిదారులకు పింఛన్ అందించేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి బయటకు వస్తే పరదాలు కట్టే వారని ఎద్దేవా చేసే సీఎం చంద్రబాబు యల్లమంద పర్యటనలో మాత్రం 800 మంది పాల్గొనే అవకాశం ఉన్న సభ కోసం 1120 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు కల్పించారు. సోమవారం నుంచే వందలాది మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం గ్రామానికి రప్పించారు. మంగళవారం ఉదయం నుంచి ప్రధాన వీధుల్లో పోలీసుల హడావుడే కనిపించింది. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కోసం గ్రామంలోని ఇద్దరి గృహాలకు సీఎం చంద్రబాబు వెళ్లారు. సీఎం రాకముందే ఆ గృహాల సమీపంలోకి సామాన్యులను అనుమతించలేదు. ఎక్కడికక్కడ బారిక్యాడ్‌లు ఏర్పాటుచేశారు. ప్రధాన రోడ్డులోని లబ్ధిదారుడి ఇంటి ఎదురుగా నివసించే వారిని కూడా బయట ఉండవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. తమ గ్రామానికి ముఖ్యమంత్రి వస్తుంటే చూసే అవకాశం కూడా ఇవ్వరా అంటూ వారు పోలీసులను ప్రశ్నించడం వినిపించింది. ఇతర గ్రామాల వారు యల్లమందకు రాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుచేశారు. చంద్రబాబు తన ప్రసంగంలో తాను సాదాసీదా సీఎం అని చెప్పడం గమనార్హం.
ఉకదంపుడు ఉపన్యాసం
యల్లమంద గ్రామంలో సీఎం చంద్రబాబు ప్రసంగం సభకు హాజరైన ప్రజలకు చిరాకు తెప్పించింది. దాదాపు గంట ఆలస్యంగా సభకు వచ్చిన చంద్రబాబు తన ప్రసంగాన్ని గంటకు పైగా కొనసాగించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.45కు సభ ముగించాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా 2.45కు సభ పూర్తయింది. దీంతో చంద్రబాబు మాట్లాడుతుండగానే మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కొంత సేపటికి బయటకు వెళ్లే వారి సంఖ్య పెరిగి వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి వారిని బయటకు వెళ్లేందుకు అడ్డుకున్నారు. సభలో నుంచి ఏవరూ బయటకు వెళ్లకుండా చేసే బాధ్యతను వెలుగు సిబ్బంది నిర్వహించారు. మహిళలు కుర్చిలో నుంచి నిలబడగానే వారు వెళ్లి బలవంతంగా కూర్చోబెట్టడం కనిపించింది.
సభలో నుంచి మధ్యలో వెళ్లిపోతున్న మహిళలు
అడుగడుగునా పోలీసు ఆంక్షలు
70 నిమిషాలు సాగిన
ముఖ్యమంత్రి ప్రసంగం
మధ్యలోనే బయటకు వెళ్లిపోయిన
మహిళలు, వృద్ధులు
నేను సాదాసీదా సీఎం అంటూ డాబు
Comments
Please login to add a commentAdd a comment