బొబ్బిలిలో జనంలేక బోసిపోయిన చంద్రబాబు రా కదలిరా సభ
● చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగానికి విసుగెత్తిన టీడీపీ శ్రేణులు
● చంద్రబాబు ప్రసంగిస్తుండగానే
వెళ్లిపోయిన జనసేన కార్యకర్తలు
బొబ్బిలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బొబ్బిలిలో రా కదలిరా పేరుతో బుధవారం నిర్వహించిన సభ ఆద్యంతం అవస్థల నడుమ సాగింది. ఉదయం 11 గంటలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ప్రజలను, కార్యకర్తలను నాయకులు తరలించారు. వారికి టెంట్లు లేకుండా ఆరుబయట కుర్చీలు వేశారు. చంద్రబాబునాయుడు సరిగ్గా మధ్యాహ్నం 1.10 నిమిషాలకు రావడంతో పార్టీ శ్రేణులు విసుగెత్తిపోయారు. కొందరు సభ ప్రారంభానికి ముందే వెళ్లిపోగా, మరికొందరు చంద్రబాబు మాట్లాడుతుండానే ఇంటిబాట పట్టారు. చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగం పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది. కుర్చీలు ఖాళీగా కనిపిస్తుండడంతో బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన పదేపదే ముందుకు రావాలంటూ కార్యకర్తలను కోరినా ఎవరూపట్టించుకోలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిగా రూ.3వేలు ఇస్తా.., అమెరికాలో ఉద్యోగమైనా బొబ్బిలి నుంచే పనిచేసేలా వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిస్తానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పడంపై జనం నవ్వుకున్నారు. మాజీ మంత్రి అశోక్ కుమార్తె వచ్చీరాని తెలుగు పదాలు మాట్లాడినప్పుడు ఇదేం భాషరా అంటూ నిట్టూర్చారు. భోగాపురానికి సంకుసాపన (శంకుస్థాపన) చేశారనీ, విమానాలకు ఏక్సిడెంట్లు అవుతాయనీ, ఆడపిల్లల పై ఆగాయితాలు(అఘాయిత్యాలు) జరుగు తాయ ని అన్నప్పుడు ప్రజలు అర్థం కాక నవ్వుకున్నారు. పార్వతీపురం టీడీపీ ఇన్‌చార్జి విజయచంద్ర మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెనుక నుంచి ముందుకు నడిపిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి పడాల అరుణ జనసేన కండువా వేసుకుని పదే పదే టీడీపీ పాటే పాడడంతో ఆ పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తంచేశాయి. గ్రోత్ సెంటర్‌లో అభివృద్ధి లేదనీ, పరిశ్రమలు రావడం లేదంటూ బేబీ నా యన విమర్శలు తన అన్న సుజయ్ పనితీరు వైపే చూపాయి. విమర్శించారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే చిరంజీవికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment