పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి
● అధికారులకు కలెక్టర్ సూచన
పార్వతీపురం: జిల్లాలో పారిశ్రామిక రంగంలో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాట క, ఆతిథ్య రంగాన్ని సేవారంగాలుగా పరిగణించి హోటల్స్ ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలని సూచించారు. ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయడం, ఐటీని ప్రోత్సహించడం, ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. నిమ్మగడ్డితో వస్తువుల తయారీ కేంద్రాల స్థాపనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సేవా రంగాలకు పెట్టుబడి రాయితీ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ రాయి తీ, భూమార్పిడి, జీఎస్‌టీ, వడ్డీ రాయితీ తదితరాలు ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎంవీ కరుణాకర్, సహాయ సంచాలకుడు పి.సీతారాం, జిల్లా భూ గర్భ జలాల అధికారి ఎ.రాజశేఖరరెడ్డి, జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ ఎన్.విజయ్ స్వరూప్, నాబార్డ్ ఏజీఎం దినేష్ పాల్గొన్నారు.
భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ అధికారుల ను ఆదేశించారు. ఈ మేరకు పోలమాంబ జాతర ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డు తూ ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే శంబర పోలమాంబ జాతరలో భక్తులకు ఎలాంటి కొరత లేకుండా నిరంతరం తాగునీ రు సరఫరా అయ్యేలా పైపులైన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. మరుగుదొడ్ల కొరత లేకుండా చూడడంతో పాటు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా పర్యవేక్షించాలన్నారు. వైద్యశిబిరాలు, భక్తుల రాకపోకలకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయం పక్కన ఉన్న గోముఖి నది వద్ద స్నానాలు, వంటలు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డ్వామాపీడీ కె. రామచంద్రరావు, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment