రైల్వే ట్రాక్ దాటిన గజరాజులు
కొమరాడ: గడిచిన నెలరోజులుగా కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట, గంగరేగువలస, స్వామినాయుడువలస, చినఖేర్జెల, కందివలస, జంఝావతి రబ్బర్ డ్యాం తదితర ప్రాంతలల్లో సంచారం చేసిన ఏనుగులు గుంపు గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో రైల్వే ట్రాక్ దాటటడంతో ఆ ప్రాంత రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గారవలస గ్రామసమీపంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో కళ్లికోట, దుగ్గి, గుణానుపురం గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జొన్న,పామయిల్, అరటి, టమాటో తదితర పంటలు పుష్కలంగా ఉండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం గజరాజులు గుంపును శాశ్వతంగా తరలించేలా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలకు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment