ఫిబ్రవరి 20లోగా పల్లె పండగ పనులు పూర్తికావాలి
పార్వతీపురం: పల్లె పండగ పథకం కింద చేపట్టిన రహదారి పనులు ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె పండగలో మంజూరుచేసిన పనులు ఇంతవరకు 32శాతం మాత్రమే ప్రారంభించారని, మిగిలినవి కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పల్లెపండగ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, దీనిపై ఇంజినీర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి లక్ష్యాలను అధిగమించాలని కోరారు. రోజువారీ ప్రగతి వివరాలను సమర్పించాలని చెప్పారు. బీటీ, సీసీ రహదారుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోతే బిల్లుల చెల్లింపు జరగదని స్పష్టం చేశారు. సమావేశంలో డుమా పీడీ కె.రామచంద్రరావు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, పీఆర్, ఐటీడీఏ ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment