పనులు ప్రారంభిస్తున్న జీఎం సుధాకర్‌రావు
రామగిరి: సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమానికి వెనుకాడదని, అవసరమైన నిధులు కేటాయిస్తుందని ఆర్జీ–3 జీఎం ఎన్.సుధాకర్‌రావు అన్నారు. మంగళవారం సెంటనరీకాలనీ పబ్లిక్ పార్కులో రూ.8.06 లక్షలతో నూతనంగా నిర్మించనున్న మరుగుదొడ్లు, రూ.2.52 లక్షలతో ఓపెన్ స్టేజీ పనులకు భూమిపూజ చేసి, ప్రారంభించారు. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తితోపాటు ఉద్యోగుల రక్షణ, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కాలనీవాసులు, పరిసర ప్రాంత ప్రజలు పార్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీవైపీఎం రవీందర్ రెడ్డి, సివిల్ డీజీఎం పద్మరాజు, సీనియర్ సెక్యూరిటీ అధికారి లక్ష్మీనారాయణ, డీవైపీఎం శ్రీహరి, సివిల్ డీవైఎస్ రామకృష్ణ, అధికా రుల సంఘం ప్రతినిధి టి.నాగేశ్వర్‌రావు, వివిధ సంఘాల నాయకులు గౌతం శంకరయ్య, ఎంఆర్‌సీ రెడ్డి, మధునయ్య, మామిడి స్వామి పాల్గొన్నారు.
పర్యావరణం కలుషితం కాకుండా చూడాలి
గోదావరిఖని: పర్యావరణం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఆర్జీ–3 జీఎం ఎన్.సుధాకర్‌రావు అన్నారు. మంగళవారం ఓసీపీ–1 సీహెచ్‌పీలో రూ.63.53 లక్షలతో నిర్మించనున్న విండ్ బ్యారియర్‌కు భూమిపూజ చేశారు. గని రెమిడేషన్ ప్లాన్‌లో భాగంగా విండ్ బ్యారియర్ నిర్మిస్తున్నామని తెలిపారు. సీహెచ్‌పీ నుంచి బొగ్గు రవాణా చేసే సమయంలో వచ్చే దుమ్ము, ధూళిని అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణం దెబ్బ తినకుండా ఉంటుందని చెప్పారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, అధికారుల సంఘం ప్రతినిధి నాగేశ్వర్‌రావు, ప్రాజెక్టు అధికారి రాధాకృష్ణ, ఇంజినీర్ ఆర్.శ్రీనివాస్, మేనేజర్ ఉదయ్‌హరిజన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీ–3 జీఎం ఎన్.సుధాకర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment