వేగవంతంగా ధాన్యం కొనుగోలు
● అదనపు కలెక్టర్ వేణు ఆదేశాలు
మంథని: నిర్దేశిత తేమశాతం వచ్చిన ధాన్యా న్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వేణు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. పట్టణ శివారులోని పవర్‌హౌస్‌కాలనీ, అంగళూరుతోపాటు గుంజపడుగు, నాగారం, రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాలను మంగళవారం అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తేమశాతాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చే యాలని సూచించారు. 17శాతం తేమ రాగానే వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇలా కొనుగోలు చేసిన వడ్ల వివరాలను త్వరితగతిన ఓపీఎంఎస్‌లో నమోదు చేస్తూ రైతులకు త్వరగా ధాన్యం డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర వర్తించేలా చూడాలని అన్నారు. తూకం వేసిన వడ్లను వెనువెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని చెప్పారు. రవాణాలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అకాల వర్షాల దృష్ట్యా పంట నష్టపోకుండా అవసరమైన టార్పాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, అధికారి రాజేందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment