ఆశ వర్కర్లకు రూ.18వేల వేతనం చెల్లించాలి
● తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి
పెద్దపల్లిరూరల్: అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశ వర్క ర్లకు నెల వేతనం రూ.18 వేలు చెల్లించేలా తీర్మానించాలని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సుజాత మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా స్థానిక ఐటీఐ గ్రౌండ్ నుంచి అమరవీరుల స్థూ పం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. ఆశ వర్కర్లకు కనిష్ట వేతనం రూ.18 వేలు చెల్లిస్తామని కాంగ్రెస్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని ఆమె కోరారు. రజిత, జ్యోతి, స్వప్న, శివలీల, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment