స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే లా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. పోస్ట్‌మె ట్రిక్ చదివే విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, వసతిగృహాల్లో మరమ్మతులను ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సకాలంలో పూర్తిచేయాలని అన్నారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మర్యాదగా ప్రవర్తించాలి
రామగిరి(మంథని): వివిధ పనులు, అవసరా ల కోసం కార్యాలయాలకు వచ్చే సందర్శకులతో సిబ్బంది, అధికారులు మర్యాదగా వ్యహరించాలని జెడ్పీ సీఈవో నరేందర్ సూచించారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజారాణి, ఎంపీ వో ఉమేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
28న ప్రజాభిప్రాయ సేకరణ
జ్యోతినగర్(రామగుండం): తెలంగాణ స్టేజీ– 2 రెండోదశలో చేపట్టే ఒక్కోటి 800 మెగావాట్ల(మొత్తం 2,400 మెగావాట్ల) సామర్థ్యంగల మూడు సూపర్ థర్మల్ పవర్ యూనిట్ల(ప్రాజెక్టు)పై ఈనెల 28వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారు. ఈమేరకు ఎన్టీపీసీ సహకారంతో పర్యావరణ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లోని జ్యోతినగర్ క్రీడా మైదానంలో సభ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు నిర్మాణం కో సం అవసరమైన భూసేకరణ చేస్తారు. ప్రస్తు తం 256.97 హెక్టార్లు అందుబాటులో ఉండ గా, మరో 481.57 హెక్టార్లు ప్రాజెక్టుకు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.29,344.85 కోట్లు అని అధికారులు తెలిపారు.
1,011 విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో గతేడాది 1,011 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ మాధవరావు తెలిపారు. ఒక్క డిసెంబర్‌లోనే 191 కనెక్షన్లు ఇచ్చినట్లు ఆయన వివరించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సత్వరమే మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో న మోదు చేస్తున్నామని తెలిపారు. దరఖాస్తు స్టే టస్ తెలుసుకునేందుకు అగ్రికల్చర్‌పోర్టల్‌లో లాగిన్ కావాలని ఆయన సూచించారు.
వందశాతం ఉత్తీర్ణత లక్ష్యం
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ వరంగల్ రిజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి సూచించారు. గర్రెపల్లి జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం ఆయ న సందర్శించారు. పాఠశాలలో వసతులు తని ఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులతో సమావేశమయ్యా రు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే లా సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. హెచ్‌ఎం కవిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బకాయిలు వసూలు చేయాలి
ఓదెల(పెద్దపల్లి): గ్రామాల్లో పేరుకుపోయిన ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల పంచాయతీ కార్యదర్శులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలని అన్నారు. ప్రతీనెల మొదటివారంలో మంచినీటి ట్యాంకుల పర్యవేక్షణ, మిషన్ భగీరథ, బోరుబావుల మరమ్మతు తదితర పనులు పరిశీలించాలని ఆయ న సూచించారు. డీఎల్‌పీవో వేణుగోపాల్, ఎంపీవోలు షబ్బీర్‌పాషా, కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment