ఆకట్టుకున్న వేడుకలు
జ్యోతినగర్(రామగుండం): స్థానిక ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని లలితకళా తోరణంలో సచ్‌దేవ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వార్షికోత్సవం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ – తెలంగాణ ప్రాజెక్టు సీజీఎం చందన్‌కుమార్ సామంత జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జీఎం అలోక్ కుమార్ త్రిపాఠి, ఏజీఎం(హెచ్‌ఆర్) బిజయ్‌కుమార్ సిగ్దర్, ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా, సచ్‌దేవ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ సుధీర్ సచ్‌దేవ, ప్రిన్సిపాల్ జ్ఞాన్‌చంద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment