చైనా మాంజాపై డేగకన్ను
గోదావరిఖని: చైనీస్ మాంజా, లేదా టాంగస్ సింథటిక్ పదార్థం లేదా నైలాన్‌తో చైనా మాంజా తయారు చేస్తారు. దానిని పదునుగా చేయడానికి గాజు, లోహం వినియోగిస్తారు. గాలిపటం ఎగురవేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది ఎగురవేయడానికి అనుకూలంగా ఉన్నా.. పర్యావరణానికి ముప్పుతోపాటు ప్రజలు, జంతులువులు, పక్షుల ప్రాణాల మీదకు తెస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిస్థానంలో కాటన్‌తో తయారు చేసిన దారం వినియోగించాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.
తనిఖీలు తప్పవు..
నైలాన్, సింథటిక్‌తో తయారు చేసిన దారంతో పతంగులు ఎగరవేసినా, షాప్‌ల్లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుశాఖ హెచ్చరిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజా ఎక్కువగా విక్రయించే దుకాణాలపై దృష్టి సారించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. చైనా మాంజాతో పక్షులు, ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారు. గాలిపటాలు ఎగురవేసే వారు కూడా ప్రమాదానికి గురైన సందర్భాలు జిల్లావ్యాప్తంగా అనేకం ఉన్నాయి.
చైనా మాంజా విక్రయిస్తే జైలు
పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజా అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను విక్రయిస్తే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా కూడా విధించనున్నారు. అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. చైనా మాంజా విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా డయల్ 100 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
క్రయ, విక్రయాలపై పోలీసుల నిఘా
దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలకు సీపీ శ్రీనివాస్ ఆదేశాలు
నైలాన్, సింథటిక్ దారాలతో తయారు చేసిన గాలిపటం ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి గొంతుకు
తగిలింది. తీవ్రగాయాలతో బైక్‌పైనుంచి పడి మృతి చెందాడు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాలలో ఈ సంఘటన జరిగింది. ఇలాంటి
ప్రమాదాలు జరగకుండా రామగుండం పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment