మహిళా సంఘాల సభ్యులకు ‘సీ్త్రనిధి’
● ప్రాజెక్టు మేనేజర్ సతీశ్‌బాబు
జ్యోతినగర్(రామగుండం): మహిళా సంఘాల సభ్యులకు సీ్త్రనిధి ద్వారా రుణాలు అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్(డీపీఎం) సతీశ్‌బాబు కోరారు. ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డులోని మహిళా సంఘ భవనంలో పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైక్రో ఫైనాన్స్‌లు ఇచ్చే అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతీ సంఘం సభ్యురాలు జీవనోపాధి కోసం రుణాలు వినియోగించాలని అన్నారు. ఇందుకోసం మెప్మా అధికారులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. క్రమంతప్పకుండా సమావేశాలు నిర్వహించి పొదుపు రుణాల రికవరీ 100 శాతం నమోదు చేయాలని చెప్పారు. రామగుండం నగర సమాఖ్యలో 13 ఏళ్ల తర్వాత సీ్త్రనిధి రుణాలు అందుబాటులోకి వచ్చాయని, సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్‌ఎం దుర్గా ప్రసాద్ సీ్త్రనిధి రుణాల్లో రకాలు, వడ్డీ, ఈఎంఐ, మైక్రో ఫైనాన్స్‌లకు మధ్య వ్యత్యాసం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళల సందేహాలను నివృత్తి చేశారు. సమాఖ్యలకు ట్యాబ్‌లను అందించారు. కార్యక్రమంలో టీఎంసీ మౌనిక, సీ్త్రనిధి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు, సీవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment