బీసీ బారిన పడకుండా.. | - | Sakshi
Sakshi News home page

బీసీ బారిన పడకుండా..

Published Thu, Jan 9 2025 12:56 AM | Last Updated on Thu, Jan 9 2025 12:56 AM

-

● రోజుకు 5–6 గ్రాముల కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలి.

● కొవ్వు ఎక్కువగా ఉండే ఫుడ్‌ తగ్గించాలి.

● అరటిపండ్లు, ఆలివ్‌, డ్రైప్రూట్స్‌ వంటి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

● ధూమపానం, మద్యపానం, కాఫీ మానేయాలి. రోజుకు 7–8 గంటలు నిద్ర పోవాలి.

● ప్రతీరోజు కనీసం 30 నిమిషాలు నడక, యోగా, ధ్యానం లేదా స్వల్ప వ్యాయామం చేయాలి.

షుగర్‌ రాకుండా ఉండాలంటే..

● చక్కెర తగ్గించి, జొన్న, రాగి, గోధుమ వంటి ధాన్యాలు తీసుకోవాలి.

● ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

● బీన్స్‌, బాదం, క్యారెట్‌, కీరా, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.

● అధిక బరువు డయాబెటిస్‌ ముప్పును పెంచుతుంది. కాబట్టి, రోజూ జాగింగ్‌ చేయాలి.

● కుటుంబంలో షుగర్‌ ఉన్నవారు ఉంటే, మిగిలిన కుటుంబసభ్యులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్ష ద్వారా తరచూ తెలుసుకోవాలి.

● రోజులో మూడు పూటలు బాగా తినడానికి బదులు చిన్నచిన్న మొత్తాల్లో ఎక్కువసార్లు భోజనం చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement