దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ● రూ.27లక్షల ఉపకరణాలు పంపిణీ
పెద్దపల్లిరూరల్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కలెక్టరేట్‌లోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి దివ్యాంగులకు రూ.27లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలోని విద్యార్థులకు ఆర్‌బీఎస్‌కే వైద్య బృందాలు వైద్య పరీక్షలు చేస్తూ ఆరోగ్య సమస్యలు గుర్తించి చికిత్స అందిస్తున్నాయని తెలిపారు. జిల్లా సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాల్‌రావు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
వసతుల కల్పనకు ప్రాధాన్యం
జూలపల్లి(పెద్దపల్లి): గ్రామీణ ప్రాంతాల సత్వర అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన బుధవారం ప్రారంభించి మా ట్లాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్, ధూళికట్ట సింగిల్‌విండో చైర్మన్ వేణుగోపాలరావు, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు నర్సింహయాదవ్, ఎంపీడీవో పద్మజ, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అండగా నిలుస్తున్నా
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ కల్పన, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ బిరుదు సమత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తారు రోడ్లతో ప్రయాణం సులువు
ఓదెల(పెద్దపల్లి): తారు రోడ్లతో ప్రయాణం సులు వు అవుతుందని ఎమ్మెల్యే విజయరమణణావు అన్నారు. పొత్కపల్లి – కాల్వశ్రీరాంపూర్ మధ్య చేపట్టిన తారురోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నాయకులు ఆళ్ల సుమన్‌రెడ్డి, మూ ల ప్రేంసాగర్‌రెడ్డి, వంగ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment