పేదలకు ప్రజాప్రభుత్వం అండ
● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్
జ్యోతినగర్(రామగుండం): పేదలకు ప్రజాప్ర భుత్వం అండగా ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ ఇందిరమ్మకాలనీ లో ఇటీవల విజయలక్ష్మికి చెందిన ఇల్లు అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. దీంతో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మడిపల్లి మల్లేశ్ ఆమె కోసం నిర్మించిన కొత్త ఇంటిని ఎమ్మెల్యే బు ధవారం ప్రారంభించి మాట్లాడారు. కాలనీ స మీప కుంట ప్రాంతాన్ని బఫర్ జోన్ పరిధిలోకి తీసుకొస్తున్నారని, అర్హులకు అక్కడ పట్టాలు ఇ ప్పి స్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇందిరమ్మ కాలనీలో రియల్ ఎస్టేట్ చేసే కబ్జాదారులను గుర్తించి జైలుకు పంపిస్తానని అన్నారు. మేయర్ బంగి అనిల్‌కుమార్, నాయకులు దీటి బాలరా జ్, మడిపల్లి మల్లేశ్, ఆసిఫ్ పాషా, పెగడపల్లి రమేశ్‌బాబు, ఈదునూరి మల్లేశ్ పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ క్యాలండర్ ఆవిష్కరణ
కాగా, పీఆర్‌టీయూ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఆవిష్కరించారు. ప్రతినిధులు గండు కృష్ణమూర్తి, ప్రేమ్‌కుమార్, రఘుబాబు, కందుల సతీశ్‌కుమార్, జనార్దన్‌రావు, వెంకటలక్ష్మి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సీఎస్సార్ నిధులు కేటాయించాలి
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్ర భావిత ప్రాంతాల అభివృద్ధికి సీఎస్సార్ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ కోరా రు. ఈమేరకు ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఈవో అలోక్ సింఘాల్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment