సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి.అన్ని స్థానాలకు టీఆర్ఎస్.. అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ 26 మంది సిట్టింగ్‌లను మార్చగా, బీజేపీ 129 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 69 డివిజన్లలో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించలేదు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. (చదవండి: రాజధానిలో వేడెక్కిన రాజకీయం)
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్ పత్రాలు దాఖలకు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ తుది జాబితాపై కసరత్తు మరింత వేగవంతం చేశాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ సైతం పోటాపోటీగా గెలుపు గుర్రాల వేటలో వ్యహత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్ దక్కనివారిని చేరదీస్తున్నాయి. (చదవండి: బల్దియా పోరు: గెలుపు గుర్రాల కోసం భారీ కసరత్తు..)
Comments
Please login to add a commentAdd a comment