సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరవు వస్తుందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రంలో తిరగడం వల్లే వర్షాలు కురవడం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి.. ఆరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణపై చర్చకు సిద్ధం’’ అని మంత్రి స్పష్టం చేశారు.
టీడీపీ హయాంలో కంపెనీలతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని అక్రమాలకు పాల్పడ్డారు. టీడీపీ హయాంలో రైతులకు ట్రాక్టర్లలో ఇచ్చే సబ్సిడీని మింగారు. బాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడాన్ని సాధారణమని అంటున్నారు. రాజధాని పేరుతో తాత్కాలిక భవనాల పేరుతో సబ్ కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి ముడుపులు తీసుకున్నారు కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నోటీస్‌లతోనే అవినీతి జరిగిందని నిర్థారణ అయ్యింది. చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారని ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు సమాధానం చెప్పలేక చంద్రబాబు కప్పిపుచ్చు కుంటున్నారు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.
‘‘దమ్ముంటే పచ్చ మీడియా కూడా దీనిపై రాయాలి. మార్గదర్శిలో అక్రమాలు.. వెస్ట్ బెంగాల్ లోని శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంతో సమానం. చంద్రబాబుకు వచ్చిన ముడుపులపై కేంద్ర సంస్థ అన్ని వివరాలతోనే నోటీస్ ఇచ్చింది. చంద్రబాబు ఎవరెవరి వద్ద ఎంత తీసుకున్నారో అన్నీ బయటకు వస్తాయి. మేము గతంలోనే ఈ విషయంపై ఆరోపణలు చేశాం. ఇప్పుడవి నిజమయ్యాయి’’ అని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: శెభాష్ సీఎం జగన్.. ఉద్దానంపై ప్రత్యేక శ్రద్ధకు హ్యాట్సాఫ్
Comments
Please login to add a commentAdd a comment