సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రాష్ట్రాన్ని, దేశాన్ని దోపిడీ చేశాయని కేంద్రమంత్రి బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ది అవినీతి, అక్రమాల చరిత్ర అని..అందుకే దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని బహిష్కరించేందుకు సిద్ధమయ్యారన్నా రు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు పరిష్కారమవుతాయనే విశ్వాసం ప్రజలకు లేదన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి సమక్షంలో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అంకిరెడ్డి సుదీర్‌రెడ్డి, బొల్లపు సురేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర శాఖ డైరీని కూడా కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 1న ఉద్యోగ నోటిఫికేషన్ ఏదీ?
ఫిబ్రవరి 1న తెలంగాణ నిరుద్యోగ యువత కోసం గ్రూప్–1 నోటిఫికేషన్ ప్రకటిస్తామన్న హామీ ఏమైందని జి.కిషన్‌రెడి ఓ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విధంగా కాంగ్రెస్ మరోసారి తన నిజస్వరూపం బయటపెట్టుకుందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment