సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలోస్తున్నాయని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు.. అన్ని దశల్లో అభివృద్ధికి అడ్డు పడ్డారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం భారీ విగ్రహం ఏర్పాటు చేస్తోంది. త్వరలో బాబు జగ్జీవన్ రామ్, పూలే విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తాం. అంబేద్కర్ విగ్రహం పెడతానన్న చంద్రబాబు రూపాయి కూడా కేటాయించలేదు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేశారు.
‘‘చంద్రబాబు చేసిన అరాచకాలను ప్రజలు మరిచిపోరు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారు?. టీడీపీ హయాంలో కాల్ మనీ రాకెట్ బయట పడినప్పుడు దృష్టి మరల్చేందుకు అంబేద్కర్ విగ్రహం పెడతామని అప్పుడు చంద్రబాబు ప్రకటించారు. కనీసం విగ్రహం పెట్టడానికి పునాది కూడా వేయలేదు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం గురించి చంద్రబాబు ఎలా మాట్లాడతారు?’’ అంటూ మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు.
చదవండి: పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే.. అక్కడ ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment