రైతు చూపు నర్సరీల వైపు
ఒంగోలు రంగుతోటలో శివుని జఠాఝూటంలో ఉన్నట్లుగా
బంగారు పుష్పాలతో అలంకరించిన గణేషుడు
కంభం చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న భక్తులు
బేస్తవారిపేట: ఉద్యానవన పంటలు సాగు చేసే రైతు లు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రైతులు ఒకప్పుడు ఆకుకూరలు, కూరగాయల పంటల సాగుకు నారు, విత్తనాలు సొంతంగా సమకూర్చుకునేవారు. నారు తయారు చేసే నర్సరీలు ఉండేవి కాదు. తమ పొలంలో కొంత భూమిని నారు కోసం కేటాయించి నారు పోసుకునేవారు. పంట దిగుబడిలో నాణ్యమైన ధాన్యాన్ని విత్తనాలుగా ఉపయోగించేవారు. తమ వద్ద విత్తనాలు, నారు లేకపోతే తోటి రైతుల వద్ద తీసుకుని పంటలు సాగు చేసేవారు. ఆధునిక కాలంలో రైతులు నూతన సాంకేతిక పద్ధతులను పాటిస్తున్నారు. నారు మడులకు స్వస్తి పలికారు. ప్రస్తుతం నారు గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు.
జిల్లాలో 2023–24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైంది. నేడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇప్పటి వరకు మిరప 2100, టమోట 850 ఎకరాల్లో నాటారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గే అవకాశముంది.
గతంలో మిరప, టమాట పంటల్లో నారు కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి. రైతు పొలంలోనే వారికి కావాల్సిన నారు కోసం కొంత విస్తీర్ణంలో విత్తనాలు చల్లేవారు. అవి కొంతమేర పెరిగిన తర్వాత వాటిని పొలాల్లో నాటుకునేవారు. ఈ పనుల కోసం దాదాపు 30–45 రోజుల సమయం పట్టేది. మిరప, టమాట సాగు విస్తీర్ణం పెరగడం, తక్కువ సమయంలో దిగుబడులు రావాలని రైతులు ఆరాటపడుతున్నారు. ఐదేళ్లుగా మిరప పంటకు మంచి ధర పలకడంతో సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. టమాట, మిరప వంటి నారుమళ్లకు ప్రత్యామ్నాయంగా రెడిమేడ్‌గా మొక్కలు సరఫరా చేసే నర్సరీలు అందుబాటులోకి వచ్చాయి. నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తున్నారు. కొందరు రైతులు తమకు నచ్చిన విత్తనాలను నర్సరీల్లో పెంచుకోవడానికి మొక్కకు కొంత ధర చెల్లిస్తున్నారు. మిరప, టమాట పంటలతోపాటు కూరగాయల సాగు అధికంగా చేస్తున్నారు. ఇందు కోసం రైతులు నర్సరీల్లోని షేడ్‌నెట్‌లో పెంచిన నారును, మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది రైతులు తమ విత్తనాలు ఇచ్చి నారు తయారు చేయించుకుంటున్నారు. జిల్లాలో 215 నర్సరీలు రైతులకు నారు సరఫరా చేస్తున్నాయి. రైతుకు అవసరమయ్యే మేర విత్తనాలను కొని నర్సరీ యజమానులకు ఇచ్చి నారు పెంచుకుంటారు. దీని కోసం మొక్కకు రూ.0.40 పైసలు నుంచి రూ.0.50 పైసలు చెల్లించాలి. 40 రోజుల తర్వాత మొక్కలు తీసుకెళ్లి పొలంలో నాటుకోవాలి. మరి కొందరు రైతులు మొక్కకు రూ.1 నుంచి రూ.2 చెల్లించి నర్సరీ యజమానుల వద్ద కొంటున్నారు.
నర్సరీల నుంచి మొక్కల కొనుగోలు ఒక్కో మొక్క రూ.1 నుంచి రూ.2 వరకు విక్రయం నర్సరీ మొక్కలతో సమయం, ఖర్చు ఆదా అవుతుందంటున్న రైతులు జిల్లాలో 215 అనుమతి పొందిన నర్సరీలు
లైసెన్స్ ఉన్న నర్సరీల నుంచి కొనుగోలు చేయాలి
రైతులు నారు కొనేటప్పుడు వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన నర్సరీల నుంచి మాత్రమే నారు మొక్కలు కొనుగోలు చేయాలి. రైతు నారు కోసం అందించే విత్తనాలు సర్టిఫైడ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి ఇవ్వాలి. షేడ్‌నెట్‌లోని నారు మొక్కలు శాసీ్త్రయ పద్ధతుల్లో పెంచడం వల్ల నాణ్యతగా ఉండటంతోపాటు సమయం ఆదా అవుతుంది.
– గోపిచంద్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment