ఒంగోలు వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా రవిబాబు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా చుండూరి రవిబాబును నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చుండూరి రవిబాబు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి శాలువతో సన్మానించి, బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment