ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలి
పొన్నలూరు: గ్రామాల్లో పేద ప్రజలు నిర్మించుకుంటున్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని త్వరితగతిన పూర్తి స్థాయిలో నిర్మించేలా చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మండలంలోని పరుచూరివారిపాలెంలో గృహ నిర్మాణాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలపై ప్రతి రోజూ గృహ నిర్మాణశాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళా లబ్ధిదారులకు రూ.35 వేలు డ్వాక్రా రుణం మజూరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డ్వాక్రా గ్రూపుల్లో లేని మహిళలను కొత్తగా గ్రూపు తయారు చేసి ఆ తరువాత రుణం మంజూరు చేయించాలన్నారు. ముఖ్యంగా కాలనీలో రోడ్లు, సైడు కాలువలు, విద్యుత్ సౌకర్యం, తాగు నీరు తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజూ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై నివేదిక సమర్పించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్థన్‌రెడ్డి, హౌసింగ్ డీఈ సత్యనారాయణ, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ సుజాత పాల్గొన్నారు.
సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం
పొన్నలూరు: కొండపి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమైన సంగమేశ్వర ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత వరకు త్వరలోనే ప్రారంభిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మండలంలోని సంగమేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మ్యాప్‌తో పాటు నిర్మాణ ప్రాంతాన్ని ఇప్పటి వరకు జరిగిన పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిలిచిపోయిన సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న ధరలు ప్రకారం నిధుల అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సాధ్యమైనంత త్వరగా సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించి పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్థన్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ కరిముల్లా, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ సుజాత పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా పరుచూరివారిపాలెంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment