ప్రకాశం
శనివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2024
న్యూస్‌రీల్
9
– 10లో..
కొత్తపట్నం సముద్రతీరంలో సముద్రస్నానం చేసేందుకు పోటెత్తిన భక్తులు
కొత్తపట్నం సముద్ర తీరంలో సైకత శివలింగాలకు పూజలు చేస్తున్న మహిళలు
ఉచిత ఇసుక ఇస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం లోడింగ్, రవాణా చార్జీల పేరుతో పెనుభారం మోపుతోంది. మద్యం వ్యాపారం తరహాలోనే ఇసుక వ్యాపారాన్ని తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇసుక స్టాక్ పాయింట్లకు లైసెన్సుల మంజూరు పేరుతో ఇసుక దందాకు తెరతీశారు. జిల్లాలో ఇసుక రీచ్‌లు లేకపోవడంతో స్టాక్ పాయింట్ల నుంచే ఇసుక తరలించుకోవాలి. లారీ ఇసుక కావాలంటే జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.27 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. అంత ఇచ్చేందుకు సిద్ధమైనా నో స్టాక్ బోర్డులు పెట్టి ఇసుక కోసం టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఉసూరుమంటున్నారు.
తెలుగుదేశం నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇసుక వ్యాపారాన్ని కూడా మద్యం వ్యాపారం తరహాలో అధికారికంగా టీడీపీ నాయకులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఉచిత ఇసుక విధానం– 2024 ప్రకారం జిల్లాలో ఇసుక రీచ్‌లు లేనందున ఇసుక డిపోలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇసుక డిపోల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులు, ఏజన్సీలకు అప్పగించనుంది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానించింది. జిల్లాలోని ఒంగోలు నుంచి 12, మార్కాపురం నుంచి 8, గిద్దలూరు నుంచి 2, యర్రగొండపాలెం నుంచి 3, కనిగిరి నుంచి 3, దర్శి నుంచి ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేశారు. ఈ ప్రక్రియంతా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన వారి చేతనే దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. దీంతో వ్యూహాత్మకంగా ఇసుక వ్యాపారాన్ని తెలుగుదేశం ప్రజా ప్రతినిధుల చేతికి అప్పగించడం పూర్తయినట్లేనని చెప్పవచ్చు.
● అటకెక్కిన ఉచిత ఇసుక హామీ ● లారీ ఇసుక రూ.18 వేల నుంచి రూ.27 వేలు
● ట్రాక్టర్ ఇసుక రూ.4 వేల నుంచి రూ.6 వేలు ● రవాణా ఖర్చులు అదనం
● అయినా సరే నో స్టాక్ ● పనులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు
● కొత్తగా స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు లైసెన్సులు జారీ
● అధికారికంగా తమ్ముళ్లకు ఇసుక దందా అప్పగింత
30/25
గరిష్టం/కనిష్టం
మద్యం తరహాలో
Comments
Please login to add a commentAdd a comment