కూటమి ప్రభుత్వం అన్నీ విధాలా మోసగించింది
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు
ఒంగోలు సిటీ: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలను అన్నీ విధాలా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు అన్నారు. నూతనంగా నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి శుక్రవారం వచ్చిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో అధునాతన వసతులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలలో సిక్స్‌లు కొడుతోందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. కేవలం టీడీపీ నాయకులే సిండికేట్ అయి మద్యం షాపులను దక్కించుకొని ప్రభుత్వ ఆదాయాన్ని గండికొడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్‌చార్జ్ బొట్లా సుబ్బారావు, 14వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్, వైఎస్సార్‌సీపీ నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్, పిగిలి శ్రీను, ఆనం శ్రీను,రాము, వెలుగొండారెడ్డి, కాశీరెడ్డి, తిరుమలరాజు, శ్రీనివాసరాజు, నాగరాజు, షరీఫ్, మీరావలి, మురళి, సన్నిబోయిన బ్రహ్మయ్య, చిన్నా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment