కానిస్టేబుల్‌ను పరామర్శిస్తున్న ఎస్పీ దామోదర్
ఒంగోలు టౌన్: కనిగిరి ట్రాఫిక్ విధుల్లో ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యం పాలై ప్రస్తుతం ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ బి.రవికుమార్ ను ఎస్పీ ఏఆర్ దామోదర్ పరామర్శించారు. మూడేళ్లుగా పెద చెర్లోపల్లి పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన ఆయన ఇటీవలే కనిగిరి ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా బదిలీ అయ్యారు. ఈ నెల 8వ తేదీ ట్రాఫిక్ విధుల్లో ఉండగా ఒక్కసారిగా రోడ్డు పక్కన పడిపోయారు. పక్కనే ఉన్న పోలీసు సిబ్బంది ఆయనను కనిగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హై బీపీతో మెదడులో రక్తంగడ్డ కట్టినట్లు నిర్ధారించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. ఈవిషయం తెలుసుకున్న ఎస్పీ శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment