ఒంగోలు టౌన్: పిల్లలకు బిర్యానీ తీసుకొని వస్తుండగా ఆ తల్లి గుండె ఆగిపోయింది. పోలీసుల కథనం ప్రకారం... కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన బడుగు విజయ లక్ష్మి కొత్త ఇంటి ప్రవేశం సందర్భంగా పిల్లలకు బిర్యానీ తీసుకొచ్చేందుకు వెళ్లింది. బిర్యానీ తీసుకొని వస్తుండగా ఈతముక్కలపాడు వెంకటాద్రి బంకు దగ్గరకు రాగానే ఒక్క సారిగా రోడ్డు మీద కూలబడిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఒంగోలు జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడ నుంచి ఒంగోలు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఈతముక్కలపాడుకు తరలించారు. అయితే ఒంగోలులోని గద్దలగుంటకు చెందిన విజయ లక్ష్మి తలిదండ్రులు తమ కూతురి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment