బెల్టుషాపులపై కఠినంగా వ్యవహరిస్తాం
మార్కాపురం: మార్కాపురం ప్రొహిబిషన్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మార్కాపురం, పెద్దారవీడు, దోర్నాల మండలాల్లోని బెల్టుషాపులు, నాటుసారా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మార్కాపురం ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటరెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ ప్రకాశంలో అక్రమ మద్యం, గంజాయి, సారా విక్రయాలపై ‘చర్యలే గమ్మత్తు.. జోరుగా మత్తు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. సీఐ మాట్లాడుతూ.. ఇప్పటికే అనుమానిత గ్రామాల్లో దాడులు చేశామని చెప్పారు. మార్కాపురం మండలంలో 11 మందిని అరెస్టు చేసి 132 మద్యం సీసాలు, పెద్దారవీడు మండలంలో 9 మందిని అరెస్టు చేసి 97 మద్యం సీసాలు, దోర్నాల మండలంలో ఇద్దరిని అరెస్టు చేసి 18 లిక్కర్ బాటిల్లు, 2 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని, 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామని వివరించారు. నాటుసారా గంజాయి విక్రయాలపై నిఘా పెట్టామని చెప్పారు. బెల్టుషాపులు, నాటుసారా తయారీ, గంజాయి అమ్మకాల సమాచారం తెలియజేయాలని కోరారు.
ఎకై ్సజ్ సీఐ వెంకటరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment