ఎగిసి పడుతున్న అలలు
● వలలు, బోట్లు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
● అప్రమత్తమైన మత్స్యకారులు
కొత్తపట్నం: తుఫాన్ కారణంగా ముందు జాగ్రత్తగా మత్స్యకారులు వలలు, బోట్లు, ఇంజన్లను సురక్షిత ప్రాంతాలకు మంగళవారం తరలించారు. సముద్రంలో లంగర్లు వేసిన బోట్లను ట్రాక్టర్ సహాయంతో మెరక ప్రాంతానికి చేర్చారు. అలలు ఎగిసి పడటంతో సముద్రం కొంచెం ముందుకొచ్చింది. అలల తాకిడికి ఇసుక కోతకు గురైంది. వేటకు ఎవరూ వెళ్లవద్దని చాటింపు వేశారు. సముద్రంలో దూరంగా వేటాడుతున్న మత్స్యకారులు సమాచారం అందించడంతో బోట్లను తిప్పుకుని వచ్చారు. సముద్ర స్నానానికి వచ్చిన భక్తులను మైరెన్ పోలీసులు అదుపు చేశారు. లోతుకు వెళ్లకుండా ఒడ్డునే స్నానం చేసేలా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment