అయ్యవారు రాక ఆరుబయట విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

అయ్యవారు రాక ఆరుబయట విద్యార్థులు

Published Wed, Dec 18 2024 12:43 AM | Last Updated on Wed, Dec 18 2024 12:43 AM

అయ్యవారు రాక ఆరుబయట విద్యార్థులు

అయ్యవారు రాక ఆరుబయట విద్యార్థులు

ఉపాధ్యాయులు లేక పాఠశాల మూత

ఆరు బయటే వేచి ఉన్న విద్యార్థులు

పుల్లలచెరువు: పాఠశాలకు ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఆరు బయటే ఉండిపోవాల్సిన పరిస్థితి పుల్లలచెరువు మండలంలోని గాజులపాలెం పాఠశాలలో మంగళవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఆ పాఠశాలకు ఏదో ఒక స్కూల్‌ నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌ వేస్తున్నారు. ఆక్రమంలో తెల్లగట్ల పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌ వేశారు. కానీ ఆ ఉపాధ్యాయుడు ఏమనుకున్నాడో ఏమో మంగళవారం పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ విషయంపై ఎంఈవో ను వివరణ కోరగా ఈ విషయంపై సదురు ఉపాధ్యాయుడిని వివరణ తీసుకుని నోటీసు జారీ చేస్తామన్నారు. పాఠశాలకు ప్రతి రోజు ఉపాధ్యాయులను పంపి పాఠశాల తెరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement