కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
ముండ్లమూరు(దర్శి): పాఠశాల విద్యాశాఖ సమగ్రశిక్షా కేజీబీవీ కార్యదర్శి డీ దేవానందరెడ్డి ఆదివారం మండలంలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 8వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి వారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. 10, 11, 12 తరగతుల విద్యార్థులకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక స్టడీ అవర్‌ను పర్యవేక్షించారు. స్లిప్‌టెస్ట్ నిర్వహించి విద్యార్థుల అభ్యాస పురోగతిని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో విద్యార్థి వారీగా వివరణాత్మక పనితీరు సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపట్ల వివరాలు సేకరించారు. వారి అవసరాలను, అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరచడానికి అభిప్రాయం సేకరించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయురాలు ఆవుల సునీత, ఉపాధ్యాయురాలు పద్మ, సిబ్బంది ఉన్నారు.
దివ్యాంగుల మోటార్ వాహనాలకు పెట్రోల్ సబ్సిడీ మంజూరు
ఒంగోలు వన్‌టౌన్: ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఉన్న అర్హులైన దివ్యాంగుల రెట్రో ఫిట్టింగ్ మూడు చక్రాలున్న మోటారు వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ సబ్సిడీని మంజూరు చేస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జీ అర్చన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న దివ్యాంగులు ఒంగోలు ప్రకాశం భవన్‌లోని దివ్యాంగుల కార్యాలయంలో దరఖాస్తులు పూర్తి చేసి జనవరి 10వ తేదీలోపు అందజేయాలని కోరారు. ఇతర పూర్తి వివరాలకు 08592–281310 అనే నంబరులో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment