● జిల్లాలో మొత్తం ఓటర్లు 18,19,448 ● మహిళా ఓటర్లు 9,13,450,పురుష ఓటర్లు 9,05885 ● నేడు తుది జాబితా విడుదల
ఒంగోలు అర్బన్: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సంక్షిప్త సవరణ–2025 లో భాగంగా సోమవారం తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకారం గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించగా అనంతరం ప్రత్యేక ప్రచార రోజులు నిర్వహించి నేడు తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. ఆ మేరకు జిల్లా ఎన్నికల విభాగం తుది జాబితాను సిద్ధం చేసింది. సదరు జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 2183 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 18,19,448 మంది ఓటర్లు ఉండగా వారిలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 9,13,450 మంది ఉండగా, పురుష ఓటర్లు 9,05885 మంది, థర్డ్ జెండర్ 113 మంది ఓటర్లు ఉన్నారు. 6655 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.
నియోజకవర్గం పోలింగ్ పురుష మహిళా థర్డ్ జెండర్ మొత్తం సర్వీస్
కేంద్రాలు ఓటర్లు ఓటర్లు ఓటర్లు ఓటర్లు ఓటర్లు
యర్రగొండపాలెం 265 1,04,711 1,01,573 2 2,06,286 220
దర్శి 282 1,14,086 1,12,137 8 2,26,231 219
సంతనూతలపాడు 256 1,04,995 1,08,823 6 2,13,824 157
ఒంగోలు 259 1,15,058 1,24,417 52 2,39,527 137
కొండపి 283 1,18,367 1,20,878 3 2,39,248 91
మార్కాపురం 257 1,07,770 1,06,473 8 2,14,251 406
గిద్దలూరు 284 1,19,435 1,20,268 22 2,39,725 5235
కనిగిరి 297 1,21,463 1,18,881 12 2,40,356 190
మొత్తం 2183 9,05,885 9,13,450 113 18,19,448 6655
Comments
Please login to add a commentAdd a comment