ఒంగోలు సిటీ: ‘‘మా ప్రభుత్వం వచ్చాక మీ అందరికీ ఒకటో తేదీనే జీతాలు ఇచ్చే బాధ్యత నాది’’ అని ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలివి.. తీరా చూస్తే ఆ మాటలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అధికారంలోకి వచ్చిన నెల ఒకటో తేదీ జీతాలు జమ చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో ఉపాధ్యాయులు చాలా సంతోషపడ్డారు. కానీ మిగతా ఏడు నెలల నుంచి జీతాలు ఆలస్యంగా వేస్తుండటంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14,500 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈనెల ఐదో తేదీ దాటినా జీతాలు పడకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
నమ్మి మోసపోయామంటున్న ఉపాధ్యాయులు..
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. లేనిపోని యాప్‌లపై శిక్షణ అని, చీటికీ మాటికీ సమావేశాలంటూ వారిని పాఠాలు చెప్పనీయకుండా అవస్థలు పెడుతోంది. గత ప్రభుత్వ హయాంలోనే బాగుందని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు ఉపాధ్యాయుల పట్ల వ్యవహరించిన తీరును సంఘాలు మరిచిపోలేదని గుర్తు చేసుకుంటున్నారు. పీఆర్సీ, ఐఆర్ తదితర అలవెన్సుల మీద కూటమి ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడకుండా ఉపాధ్యాయుల నోరు నొక్కుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐదో తేదీ దాటినా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం పై ఉపాధ్యాయుల్లో పెరిగిన అసహనం
Comments
Please login to add a commentAdd a comment